జిల్లాలో ప్రసిద్ధి చెందిన కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వంశపారంపర్య ధర్మకర్త ఎంవీఆర్ కొండలరావు, చెరుకూరి ప్రసాద్, గుడిపూడి నాగభూషణం, అనుమోలు వెంకయ్య చౌదరి, బెల్లంకొండ పిచ్చయ్య, కొర్నెపాటి సుబ్బారావు, మండవ లీలా వెంకట శ్రీనివాసరావు, రమణపాటి భాగ్యలక్ష్మి, కొత్తూరి రామసుబ్బరాయుడు, ఎక్స్‌అఫీషియో సభ్యునిగా ముఖ్యఅర్చకుడు ఆర్.కిరణ్‌కిశోర్ శర్మను నియమించారు. వీరి పదవీకాలం రెండేళ్ల పాటు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పదవీ బాధ్యతలు స్వీకరించి నాటి నుంచి కాలపరిమితి వర్తిస్తుందని ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.