VIP లతో కిట కిట లాడుతున్న పురుషోత్తమపట్నం

పొన్నూరు శాసనసభ్యుడు శ్రీ ధూళిపాళ్ళ నరేంద్ర పురుషోత్తమపట్నం లోని ప్రభల వద్ద టెంకాయ కొడుతున్న దృశ్యం.

కోటప్పకొండకు వెళ్ళే యాత్రికులు మొదట పురుషోత్తమపట్నం సందర్శించి అక్కడ ప్రభలవద్ద టెంకాయ కొట్టి ఆ తరువాత కోటప్పకొండకు వెళ్లడం ఆనవాయితి.

 

పురుషోత్తమపట్నం ప్రభల దగ్గర VIPల సందడి

20-feb-2017-01

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి సతీమణి శ్రీమతి ప్రత్తిపాటి వెంకట కుమారి

20-feb-2017-03

నరసరావుపేట DSP శ్రీ K నాగేశ్వరరావు గారు

 

20-feb-2017-02

చిలకలూరిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ నెల్లూరి సదాశివరావు

అద్దoకి శాసనసభ్యుడు శ్రీ గొట్టిపాటి రవి కుమార్

చిలకలూరిపేట మున్సిపల్ Chairperson గంజి చెంచు కుమారి గారు మరియు కుటుంబసబ్యులు

CR విద్యాసంస్థల అధినేత చుండి విజయ సారధి

CR క్లబ్ అధ్యక్షడు పావులూరి శ్రీనివాసరావు

22 నుంచే తిరుణాల

 1. త్రికోటేశ్వర స్వామి తిరుణాల ఈ నెల 22 ఏకాదశి రోజు నుంచే ప్రారంబం కానున్నాయి.
 2. నాలుగు వేల మంది పోలీసులు బందోబస్తు లో పాల్గొంటారు, దీనికి C C కెమెరాలు అదనం. పోలీసు బందోబస్తు  DSP నాగేశ్వరరావు గారు పర్యవేక్షిస్తున్నారు.
 3. రాజగోపురం ఎదురుగా భారీ శివలింగం నిర్మాణం పూర్తికావస్తుంది.
 4. లక్షా యాభై వేల లడ్లు  మరియు 75 వేల అరిసె ప్రసాదాన్ని సిద్ధం చేశారు.
 5. భక్తులు పుణ్య స్నానం చేసేందుకు చిలకలూరిపేట మేజర్ కాల్వ దగ్గర స్నాన ఘట్టాలను సిద్ధం చేశారు.

కోటప్పకొండకు ప్రత్యేక బస్సులు

నరసరావుపేట- కోటప్పకొండకు 208 బస్సులు
చిలకలూరిపేట- కోటప్పకొండకు 100

కోటప్పకొండ దిగువ ప్రాంతం నుంచి క్షేత్రం వరకు 50 మిని బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఆయన చెప్పారు.

వీఐపీల సౌకర్యార్థం కూడా మినీ బస్సులు అందుబాటులలో ఉంటాయి.

 

కొండపైకి ఆర్టీసీ బస్సులకే అనుమతి

 1. అందరం సమన్వయంగా పనిచేద్దాం. కోటప్పకొండ తిరునాళ్లను విజయవంతం చేద్దామని సభాపతి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు కోరారు. కోటప్పకొండలో తిరునాళ్ల సందర్భంగా మంగళవారం అధికారులతో రెండో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
 2. సమావేశానికి పలువురు ఉన్నతాధికారులు రాకుండా ఆయా శాఖల ఉద్యోగులను పంపించడంతో సభాపతి కోడెల అసహనం వ్యక్తం చేశారు. ఇది చాలా కీలకమైన సమావేశం. ఉన్నతాధికారులు రాకపోతే ఎలా? ఆ తర్వాత ఏమైనా జరిగితే బాధ్యులు ఎవరని ప్రశ్నించారు.
 3. అనంతరం మాట్లాడుతూ తిరునాళ్ల నేపథ్యంలో ఎక్కడా ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా చూడాలన్నారు. ఒక్కసారి ట్రాఫిక్‌ జామ్‌ అయిందంటే సర్దుబాటు చేయటం కష్టమన్న విషయం గుర్తుంచుకోవాలని చెప్పారు. పోలీసు అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు.
 4. నరసరావుపేట పట్టణం నుంచి ప్రభలు కొండకు చేరటానికి రైల్వే వారి విద్యుత్తు లైన్‌ విషయంలో వారి వద్ద నుంచి ముందుగానే చెప్పి అనుమతులు తీసుకోవాలని సభాపతి చెప్పారు.
 5. అప్పటికప్పుడు చెప్పి ఇబ్బంది పెట్టవద్దన్నారు. పారిశుద్ధ్యం విషయంలో పంచాయతీల కార్మికులే కాకుండా నరసరావుపేట పురపాలక సంఘం నుంచి కూడా కొంతమందిని సహాయంగా తెచ్చుకోవాలని అందుకు కౌన్సిల్‌లో తీర్మానం చేయాలని మున్సిపల్‌ ఛైర్మన్‌ సుబ్బరాయగుప్తాకు సూచించారు.
 6. అనంతరం కొండపైకి వెళ్లే వాహనాల విషయంలో చర్చించి ఆర్టీసీ బస్సులను మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. ప్రయివేటు వాహనాలకు అనుమతి లేదని తీర్మానించారు.

మహాశివరాత్రికి బందోబస్తు కట్టుదిట్టం

మహాశివరాత్రి తిరునాళ్లకు పోలీసు బందోబస్తు కట్టుదిట్టం చేయాలని రూరల్‌ ఎస్పీ నారాయణ నాయక్‌ అన్నారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నేరసమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం రానున్న క్రమంలో ప్రసిద్ధి చెందిన కోటప్పకొండ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. శైవక్షేత్రాల వద్ద ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. రౌడీషీటర్ల కదలికలపై నిఘా ఉంచడంతో పాటు వారికి క్రమం తప్పకుండా కౌన్సెలింగ్‌ చేయాలన్నారు. పోలీసుస్టేషన్‌ల పరిధిలో బ్లాక్‌స్పాట్‌లు గుర్తించి రోడ్డుప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టాలన్నారు.

పురుషోత్తమపట్నం నుంచి 6 విద్యుత్ ప్రభలు

కోటప్పకొండకు వెళ్ళే యాత్రికులు మొదట పురుషోత్తమపట్నం సందర్శించి అక్కడ ప్రభలవద్ద టెంకాయ కొట్టి ఆ తరువాత కోటప్పకొండకు వెళ్లడం ఆనవాయితి.

కోటప్పకొండలో తిరుణాల మహాశివరాత్రి రోజు జరుపుకొంటే, పురుషోత్తమపట్నంలో మహాశివరాత్రి ప్రభల తిరుణాల వారంరోజుల ముందునుంచే జరుపుకొంటారు.

 1. పురుషోత్తమపట్నం నుండి ఆరు అతి పెద్ద విద్యుత్ ప్రభలు ఈ నెల 24 న జరగనున్న మహా శివరాత్రికి మరొకసారి ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి.
 2. ఒక్కొక్క ప్రభకు కనీసం 40 లక్షల రూపాయలు వ్యయం అవుతుంది.
 3. ఇప్పటికే సిద్ధంగా ఉంచుకున్న పొడుగు సరివి బారులను వరుసక్రమంలో తాళ్లతో ముడులు వేస్తూ కట్టేపనిలో నిమగ్నమయ్యారు.
 4. గ్రామాల్లో ప్రభల నిర్మాణ పనుల్లో ప్రజలు పాల్గొంటుండడంతో సందడి వాతావరణం నెలకొంది.

row-21-02-2017

తిరుణాలకు సిద్దమయిన పుల్లప్ప, గ్రామ, బైరా వారి ప్రభలు.