త్రికోటేశ్వరునికి లక్ష మల్లెపూల అర్చన

  1. వైశాఖ పౌర్ణమి సందర్భంగా కోటప్పకొండలోని త్రికోటేశ్వరునికి బుధవారం రాత్రి లక్ష మల్లెపూల అర్చన నిర్వహించారు. వంశపారంపర్య ధర్మకర్త రాజామల్రాజ్‌ రామకృష్ణ తదితరులు అర్చన కార్యక్రమంలో పాల్గొన్నారు.
  2. భక్తులతో గర్భగుడి మొత్తం నిండిపోయింది. రాత్రి 8.30 గంటలకు అర్చన పూర్తయింది. అనంతరం స్వామివారికి హారతి కార్యక్రమం నిర్వహించారు.
  3. స్వామివారికి మల్లెపూలను వెంకయ్యచౌదరి సమర్పించారు. మామిడికాయలు, విసనకర్రలను ధర్మకర్త రామకృష్ణ, పిచ్చయ్య కోడూరి గోపాలకృష్ణ తదితరులు సమర్పించారు.