- అందరం సమన్వయంగా పనిచేద్దాం. కోటప్పకొండ తిరునాళ్లను విజయవంతం చేద్దామని సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు కోరారు. కోటప్పకొండలో తిరునాళ్ల సందర్భంగా మంగళవారం అధికారులతో రెండో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
- సమావేశానికి పలువురు ఉన్నతాధికారులు రాకుండా ఆయా శాఖల ఉద్యోగులను పంపించడంతో సభాపతి కోడెల అసహనం వ్యక్తం చేశారు. ఇది చాలా కీలకమైన సమావేశం. ఉన్నతాధికారులు రాకపోతే ఎలా? ఆ తర్వాత ఏమైనా జరిగితే బాధ్యులు ఎవరని ప్రశ్నించారు.
- అనంతరం మాట్లాడుతూ తిరునాళ్ల నేపథ్యంలో ఎక్కడా ట్రాఫిక్ జామ్ కాకుండా చూడాలన్నారు. ఒక్కసారి ట్రాఫిక్ జామ్ అయిందంటే సర్దుబాటు చేయటం కష్టమన్న విషయం గుర్తుంచుకోవాలని చెప్పారు. పోలీసు అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు.
- నరసరావుపేట పట్టణం నుంచి ప్రభలు కొండకు చేరటానికి రైల్వే వారి విద్యుత్తు లైన్ విషయంలో వారి వద్ద నుంచి ముందుగానే చెప్పి అనుమతులు తీసుకోవాలని సభాపతి చెప్పారు.
- అప్పటికప్పుడు చెప్పి ఇబ్బంది పెట్టవద్దన్నారు. పారిశుద్ధ్యం విషయంలో పంచాయతీల కార్మికులే కాకుండా నరసరావుపేట పురపాలక సంఘం నుంచి కూడా కొంతమందిని సహాయంగా తెచ్చుకోవాలని అందుకు కౌన్సిల్‌లో తీర్మానం చేయాలని మున్సిపల్ ఛైర్మన్ సుబ్బరాయగుప్తాకు సూచించారు.
- అనంతరం కొండపైకి వెళ్లే వాహనాల విషయంలో చర్చించి ఆర్టీసీ బస్సులను మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. ప్రయివేటు వాహనాలకు అనుమతి లేదని తీర్మానించారు.