మహాశివరాత్రి తిరునాళ్లకు పోలీసు బందోబస్తు కట్టుదిట్టం చేయాలని రూరల్ ఎస్పీ నారాయణ నాయక్ అన్నారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నేరసమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం రానున్న క్రమంలో ప్రసిద్ధి చెందిన కోటప్పకొండ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. శైవక్షేత్రాల వద్ద ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. రౌడీషీటర్ల కదలికలపై నిఘా ఉంచడంతో పాటు వారికి క్రమం తప్పకుండా కౌన్సెలింగ్ చేయాలన్నారు. పోలీసుస్టేషన్‌ల పరిధిలో బ్లాక్‌స్పాట్‌లు గుర్తించి రోడ్డుప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టాలన్నారు.