కోటప్పకొండకు వెళ్ళే యాత్రికులు మొదట పురుషోత్తమపట్నం సందర్శించి అక్కడ ప్రభలవద్ద టెంకాయ కొట్టి ఆ తరువాత కోటప్పకొండకు వెళ్లడం ఆనవాయితి.
కోటప్పకొండలో తిరుణాల మహాశివరాత్రి రోజు జరుపుకొంటే, పురుషోత్తమపట్నంలో మహాశివరాత్రి ప్రభల తిరుణాల వారంరోజుల ముందునుంచే జరుపుకొంటారు.
- పురుషోత్తమపట్నం నుండి ఆరు అతి పెద్ద విద్యుత్ ప్రభలు ఈ నెల 24 న జరగనున్న మహా శివరాత్రికి మరొకసారి ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి.
- ఒక్కొక్క ప్రభకు కనీసం 40 లక్షల రూపాయలు వ్యయం అవుతుంది.
- ఇప్పటికే సిద్ధంగా ఉంచుకున్న పొడుగు సరివి బారులను వరుసక్రమంలో తాళ్లతో ముడులు వేస్తూ కట్టేపనిలో నిమగ్నమయ్యారు.
- గ్రామాల్లో ప్రభల నిర్మాణ పనుల్లో ప్రజలు పాల్గొంటుండడంతో సందడి వాతావరణం నెలకొంది.
తిరుణాలకు సిద్దమయిన పుల్లప్ప, గ్రామ, బైరా వారి ప్రభలు.