ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండలో రోప్‌వే, సౌండ్, లైట్ సిస్టమ్‌ను త్వరలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. గురువారం సాయంత్రం రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ జయరామిరెడ్డి, భాజపా నేత వెలగపూడి రామకృష్ణ ప్రసాద్ తదితరులతో కలిసి కోటప్పకొండలో ఆయన పర్యటించారు.