కోటప్పకొండ త్రికోటేశ్వరునికి ఆరుద్రోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఈ సందర్భంగా మాలధారులు, వారి బంధువులు, స్వామివారి భక్తులు బుధవారం రాత్రి కొండకు తరలివచ్చారు. గురువారం ఉదయానికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు పూర్తవుతాయి. గురువారం స్వామివారికి అభిషేకాలు ఉండవు. దర్శనం మాత్రం యధావిధిగా ఉంటుంది. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. స్వామి వారిని మహానందీశ్వరుడిగా ప్రత్యేకంగా అలంకరించారు. సుమారు నాలుగు వేల మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. మేథాదక్షిణామూర్తి దేవస్థానానికి విద్యుత్తు అలంకరణ చేశారు.