మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ త్రికోటేశ్వరుని తిరునాళ్లకు భక్తులకు వసతులు పూర్తిస్థాయిలో కల్పించాలని శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. శుక్రవారం సాయంత్రం కోటప్పకొండలో మహాశివరాత్రి ముందుగా నిర్వహించే సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. క్యూలైన్లలో భక్తులు ప్రశాంతంగా వెళ్లాలి. అందరికి స్వామివారి దర్శనం లభించాలన్నారు. ధర్మదర్శనం కాకుండా మిగతా దర్శనాలకు పెట్టిన టికెట్ల ధరలు తగ్గించాల్సి ఉందన్నారు. స్కౌట్‌లు, ఎన్.ఎస్.ఎస్. విద్యార్థుల సేవలను ఉపయోగించుకోమని చెప్పారు. వేదపాఠశాల, యాత్రికుల విశ్రాంతి భవనాలు తి.తి.దే. నిర్మించింది. ఫిబ్రవరి 18 లోగా వాటిని ప్రారంభించాలని తి.తి.దే అధికారులకు లేఖ రాయాలని కోడెల చెప్పారు.