కోటప్పకొండలో రోప్‌ వే ఏర్పాటుకు కృషి

ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండలో రోప్‌వే, సౌండ్‌, లైట్‌ సిస్టమ్‌ను త్వరలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు సభాపతి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు అన్నారు. గురువారం సాయంత్రం రాష్ట్ర టూరిజం కార్పొరేషన్‌ ఛైర్మన్‌ జయరామిరెడ్డి, భాజపా నేత వెలగపూడి రామకృష్ణ ప్రసాద్‌ తదితరులతో కలిసి కోటప్పకొండలో ఆయన పర్యటించారు.

రూ 3 కోట్లతో అభివృద్ధి 

రూ 2 కోట్ల రూపాయలతో క్యూ కాంప్లెక్స్ మరియు రూ 1 కోటి రూపాయలతో త్రిముఖ శివలింగం నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

ఇవన్నీ వచ్చే మహాశివరాత్రి లోపల పూర్తి అవుతాయని ఆశిద్దాం.

మార్గం కోసం మల్లగుల్లాలు 

నల్లపాడు నుంచి గుంతకల్లు వరకు రైల్వే విద్యుత్ లైన్ నిర్మాణం జరుగుతుంది. ఇప్పటికే నరసరావుపేట రైల్వే స్టేషన్ వరకు లైన్ నిర్మాణం పూర్తయ్యింది.

సభాపతి కోడెల శివప్రసాదరావు గారు చొరవ తీసుకొని తాత్కాలికంగా విద్యుత్ తీగలను తొలగించడానికి ప్రయత్నిస్తారని ఆశిద్దాం.

సంక్రాంతి అభిషేకాలు

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈనెల 13, 14, 15 తేదీల్లో మూలవిరాట్‌ అభిషేకాలు చేయించుకున్న భక్తులకు స్వామివారి శేషవస్త్రం, మహాప్రసాదం అందజేస్తామని దేవస్థాన సహాయ కమిషనర్‌ డి.శ్రీనివాసరావు తెలిపారు. ఇవి కాకుండా మంటపాభిషేకాలు కూడా ఉంటాయని ఆయన చెప్పారు.

త్రికోటేశ్వరునికి ఘనంగా అభిషేకాలు

  1. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రం కోటప్పకొండలో త్రికోటేశ్వరునికి బుధవారం అర్ధరాత్రి దాటాక ఆరుద్రోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు.
  2. అర్ధరాత్రి 12 గంటలకు పైకొండపై ఉన్న బొచ్చుకోటయ్య దేవస్థానం వద్ద జ్యోతి వెలిగించారు. భారీగా భక్తులు రావడంతో రెండు గంటల నుంచి స్వామివారికి అభిషేకాలు ప్రారంభమయ్యాయి.
  3. గణపతి పూజ అనంతరం మహన్యాసకపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించారు.
  4. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, పండ్ల రసాలు, పండ్లు, శుష్కఫలాలు, విభూది, గంధం, నూనె, సుగంధ ద్రవ్యాలు, చివరగా అన్నాభిషేకం పూర్తయ్యే సరికి గురువారం ఉదయం ఏడు గంటలైంది.
  5. ఆ తర్వాత యాగశాలలో హోమాలు నిర్వహించారు. పూర్ణాహుతి కార్యక్రమంలో దేవస్థాన సహాయ కమిషనర్‌ డి.శ్రీనివాసరావు, దర్మకర్తల మండలి సభ్యులు బెల్లంకొండ పిచ్చయ్య, నాగభూషణం, చెరుకూరి ప్రసాద్‌, అనుమోలు వెంకయ్య పాల్గొన్నారు.
  6. గత ఆరేళ్లుగా అన్నదానం నిర్వహిస్తున్న తాళ్ళ కోటిరెడ్డి, అల్లు రమేష్‌, విజయవాడకు చెందిన సీకో బయోటెక్స్‌ కోటిరెడ్డి ఈ ఏడాది కూడా కార్యక్రమాన్ని నిర్వహించారు.