కోటప్పకొండ ప్రాంతం పర్యాటక క్షేత్రంగా అద్భుతంగా ఉందని ఇంగ్లాండ్‌కు చెందిన ఎంపీల బృందం తెలిపింది. శుక్రవారం సాయంత్రం ఎంపీలు వీరేంద్రశర్మ, నస్రత్ ఘని, దిలార్డు లానా, బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ యాండ్రు మికిలిస్టర్లు శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు నేతృత్వంలో కోటప్పకొండలో పర్యటించారు. సభాపతి వారికి ప్రతి అంశాన్ని వివరిస్తూ కలియదిరిగారు. ఆక్వేరియం చూసి ఎంపీలు ఆనందం వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న మినీ రైలులో కొద్దిసేపు అటవీ ప్రాంతంలో తిరిగి వచ్చారు. అనంతరం ఎంపీల బృందం మాట్లాడుతూ ఇంత చక్కగా పర్యాటక క్షేత్రం అభివృద్ధి చేసిన కోడెలను అభినందిస్తున్నామన్నారు. ఈ క్షేత్రం తమకు ఎంతగానో నచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో సంగం డెయిరీ డైరెక్టర్ మక్కెన రామాంజనేయులు, హనుమంతరావు, విశ్వేశ్వరరావు, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.