త్రికోటేశ్వరుడిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని ఆదివారం మధ్యాహ్నం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జి.శివశంకరరావు, రాష్ట్ర పరిపాలన ట్రిబ్యునల్‌ సభ్యుడు శివయ్యనాయుడు దర్శించుకున్నారు. మహానందీశ్వర మండపంలో అర్చకులు స్థలపురాణం తెలిపి ఆశీర్వచనం చేశారు. దేవస్థాన ఈవో డి.శ్రీనివాసరావు త్రికోటేశ్వరుని చిత్రపటాలను అందజేశారు. 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి కె.జయకుమార్‌, ప్రోటోకాల్‌ న్యాయమూర్తి పల్లవి, ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి సి.హెచ్‌.మాధవరావు, నరసరావుపేట ఆర్డీవో జి.రవీంద్ర, తహశీల్దార్‌ విజయజ్యోతిరాణి తదితరులు వారికి స్వాగతం పలికారు.