Ropeway on anvil for Kotappakonda

A ropeway facility would be provided to reach the hilltop of Kotappakonda soon. AP Legislative Assembly Speaker Kodela Sivaprasada Rao said that steps have been taken to develop Kottapakonda, the abode of Lord Trikoteswara Swamy, into a modern religious centre.

Speaking after participating in the ‘Aksharabhyasam’ (administering letters to children) at the Kotappakonda temple, on Thursday, he said that the Kotappakonda ghat road was recently modernised and the hill shrine will witness more developmental activities like ropeway, sound, lighting and theater facilities in the coming days besides developing the existing eco-tourism sector.

Stating that the Vedic School being maintained by the Tirumala Tirupati Devasthanam (TTD) is producing Vedic Scholars and priests, he said that as many as 35 students are studying Vedas, Upanishads and other required religious holy books in the school this year.

Vedic School principal Venkatarama Sastry, temple Executive Officer Srinivasa Rao and others participated in the programme.

Activities at Hill Shrine

  1. Kotappakonda ghat road recently modernized
  2. Plans for sound, lighting and theater facilities
  3. 35 students studying Vedas, Upanishads and other religious holy books in TTD run vedic school

 

నేడు త్రికోటేశ్వరుని సన్నిధిలో ఉచిత సామూహిక అక్షరాభ్యాసాలు

జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రమైన కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి సన్నిధిలోని ఈనెల 9న గురువారం ఉచిత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈవో డి.శ్రీనివాసరావు తెలిపారు. జ్ఞానప్రదాతగా భక్తుల నీరాజనాలు అందుకునే శ్రీమేధాదక్షిణామూర్తి స్వామి కరుణా కటాక్షాలు చిన్నారులకు ఉండాలనే తలంపుతో ఉచితంగా అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, శ్రీమేధాదక్షిణామూర్తి పూజ, గణపతి హోమం నిర్వహిస్తామని వెల్లడించారు. అక్షరాభ్యాసాలు చేయించుకునే చిన్నారులకు పలక, బలపం, సరస్వతి రూపు, కంకణం అందచేస్తామన్నారు. ప్రతి ఒక్కరికి పూజా సామగ్రి దేవస్థానమే అందచేస్తుందని వివరించారు. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కోటప్పకొండ పర్యావరణ కేంద్రం అభివృద్ధికి కృషి

రానున్న ఐదేళ్లలో కోటప్పకొండ ఘాట్‌రోడ్డులో ఉన్న ప్రకృతి పర్యావరణ కేంద్రాన్ని వందశాతం అభివృద్ధి పరచనున్నట్టు అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చెప్పారు. శుక్రవారం ఆయన ప్రకృతి పర్యావరణ కేంద్రాన్ని సందర్శించారు.   అధికారులతో సమీక్షించారు. డీఎఫ్‌వో మోహనరావు, ఫారెస్ట్ రేంజర్ హరి, కాంట్రాక్టర్ సుధీర్‌తో కలసి పర్యావరణ కేంద్రంలో పర్యటించారు. నూతనంగా నిర్మిస్తున్న ఎన్‌క్లోజర్లను పరిశీలించారు.  కృష్ణజింక, ముళ్లపంది, సాంబర్(దుప్పిజాతి)తో పాటు పలు రకాల పక్షుల జాతులను వైజాగ్ జూ నుంచి తీసుకురానున్న నేపథ్యంలో వాటిని ఎక్కడెక్కడ ఎన్‌క్లోజర్‌లలో ఉంచాలనేదానిపై పరిశీలన జరిపారు.

అలాగే ట్రాయ్ ట్రైన్ ఇప్పటి వరకు పర్యావరణ కేంద్రంలో అరకిలోమీటర్ వరకు ప్రయాణిస్తోంది. దీనిని కిలోమీటర్‌కు పెంచాలని నిర్ణయించారు. ట్రాయ్‌ట్రైన్ తిరిగే ప్రాంతంలో ఏర్పడిన గుంతలను రోలింగ్ చేయించి పూడ్చాలని ఆదేశించారు. పర్యావరణ కేంద్రంలో అభివృద్ధి నిరంతరం కొనసాగాలన్నారు.

నెమళ్లను ఆరుబయటకు వదిలితే సందర్శకులను ఆకట్టుకుంటాయని చెప్పారు.  కుందేళ్ల ఎన్‌క్లోజర్ వద్దకు కొండచిలువ రావడన్ని అధికారులు ప్రస్తావించగా, జాగ్రత్తలు తీసుకోవాలని సభాపతి సూచించారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డ్ చైర్మన్ కడియాల రమేష్, తహసీల్దార్ లీలాసంజీవకుమారి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బద్దూ నాయక్ తదితరులు పాల్గొన్నారు.