మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ త్రికోటేశ్వరునికి రూ.1,09,07,228 ఆదాయం లభించింది. గతేడాది కన్నా రూ.12 లక్షలు పైచిలుకు అదనంగా ఆదాయం లభించినట్లు దేవస్థాన సహాయ కమిషనర్ డి.శ్రీనివాసరావు తెలిపారు. దర్శనం టికెట్ల ద్వారా రూ.38,22,565, హుండీ రూ.43,42,665, ప్రసాదాల అమ్మకాల ద్వారా రూ.26,53,460, విరాళాలు, స్కీమ్‌ల ద్వారా రూ.88,561, 10 గ్రాములు బంగారం, 605 గ్రాముల వెండి లభించాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది భక్తుల రాక తక్కువేనని భావిస్తున్నప్పటికీ స్వామివారి ఆదాయం పెరగటం విశేషం. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి త్రికోటేశ్వరుని తిరునాళ్ల కార్యక్రమాన్ని విజయవంతం చేశారని సహాయ కమిషనర్ కృతజ్ఞతలు తెలిపారు.