ప్రభల ఏర్పాటులో ముందుండే చిలకలూరిపేట ప్రాంతం ఈసారి మరో ప్రత్యేకతను కూడా చాటుకుంది. అమీన్‌సాహెబ్‌పాలెం గ్రామానికి చెందిన పున్నారావు 60 అడుగుల విద్యుత్తు ప్రభను తయారు చేసి ప్రదర్శించారు. ప్రభకు ఏర్పాటు చేసే తడిక వరకు ఎల్‌ఈడీ బల్బులను అమర్చారు. మిగతా సెట్టింగ్ మొత్తం పెద్ద ప్రభకు ఉన్నట్లుగానే ఉంటాయని పున్నారావు తెలిపారు.